ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి' - District Collector Nivas latest news update

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి గ్రామంలో కలెక్టర్ నివాస్ ఆకస్మికంగా పర్యటించారు. అధికారులు, వైద్య సిబ్బంది కరోనాపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Sudden visit of District Collector Nivas
సంతకవిటి గ్రామంలో జిల్లా కలెక్టర్ నివాస్ ఆకస్మిక పర్యటన

By

Published : Jul 6, 2020, 4:37 PM IST

కంటెయిన్​మెంట్​ జోన్లలో నిబంధనలు పక్కాగా అమలు చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్.. అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా శ్రీకాకుళం జిల్లా సంతకవిటి గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సంతకవిటి, ఎమ్మార్ అగ్రహారం, మందరాడ, ముకుందపురం, గరికిపాడు గ్రామాలతోపాటు.. కంటెయిన్​మెంట్​ జోన్​ల్లో ఇంటింటా ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details