student suicide in Ap IIIT ‘అమ్మా, నాన్నా.. మీరు ఆశించిన స్థాయిలో చదవలేకపోతున్నా. జీవితం గురించి ఎన్నో కలలు కన్నా. ఆ లక్ష్యాన్ని చేరుకోలేనని భావించి.. శాశ్వతంగా దూరమవ్వాలని నిర్ణయించుకున్నా. నన్ను క్షమించండి. తమ్ముడిని బాగా చదివించండి’ అని లేఖ రాసి శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో పీయూసీ-2 చదువుతున్న విద్యార్థిని (17) ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె స్వగ్రామం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు. తల్లిదండ్రులు విశాఖలో నివాసముంటున్నారు. ట్రిపుల్ ఐటీలో పీయూసీ-2కు పది రోజుల నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థిని బుధవారం ఉదయం 9 గంటలకు పరీక్షకు వెళ్లిన అరగంట ముందే 11.30కు హాస్టల్‌కు చేరుకుని తలుపులు వేసుకుంది. కేర్‌టేకర్లకు అనుమానం వచ్చి తలుపులు బలంగా తోయడంతో పంకాకు వేలాడుతూ కనిపించింది. గురువారం ఆమె పుట్టినరోజు కావడంతో తల్లిదండ్రులు కొత్త దుస్తులు కొని, పరీక్షలు రాసి ఇంటికి వస్తుందని ఎదురుచూస్తున్నారు. అంతలోనే ఆమె చనిపోయేసరికి కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
IIIT student పరీక్ష బాగా రాయలేదని.. ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య - యాజ నిర్లక్షం కారణంగా విద్యార్థిని బలవన్మరణం
student suicide in srikakulam IIIT ‘అమ్మా, నాన్నా.. మీరు ఆశించిన స్థాయిలో చదవలేకపోతున్నా. జీవితం గురించి ఎన్నో కలలు కన్నా. ఆ లక్ష్యాన్ని చేరుకోలేనని భావించి.. శాశ్వతంగా దూరమవ్వాలని నిర్ణయించుకున్నా. నన్ను క్షమించండి. తమ్ముడిని బాగా చదివించండి’ అని లేఖ రాసి శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో పీయూసీ-2 చదువుతున్న విద్యార్థిని (17) ఆత్మహత్యకు పాల్పడింది.
పరీక్ష బాగా రాయలేదని.. ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య