కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా.. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన సార్వత్రిక సమ్మె ప్రశాంతగా జరిగింది. న్యూ కాలనీ నుంచి జీటీరోడ్డు వరకు నిర్వహించిన ర్యాలీలో ఏపీ ఎన్జీవోలతోపాటు వామపక్షాల నేతలు పాల్గొన్నారు. ఎస్‌బీఐ మినహా మిగిలిన బ్యాంకులన్నింటిని మూసేశారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ విధివిధానాలకు నిరసనగాశ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో సీఐటీయూ ఆధ్వర్యంలో... అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు నాగమణి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటుచేశారు.