శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వీధి కుక్కలు స్వైర విహారం చేసి 8 మందిని తీవ్రంగా గాయపరిచాయి. ఈదుపురం గ్రామానికి చెందిన ధనపాన వాసుదేవ్, అంబటి శంకర్, ఉప్పాడ శివ, ఈశ్వర్, తిప్పన గంగాధర్, ఎర్రమ్మ, కొటారి గ్రామానికి చెందిన నౌపడ బైరమ్మ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. వెంటనే వారికి ఇచ్ఛాపురం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో కుక్కల బెడద నుండి కాపాడాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.
వీధి కుక్కల స్వైర విహారం.. 8 మందికి గాయాలు - విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కలు
ఇచ్ఛాపురంలో వీధి కుక్కలు స్వైర విహారం చేసి 8 మందిని తీవ్రంగా గాయపరిచాయి. ఈ కుక్కల బెడద నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

వీధి కుక్కలు స్వైర విహారం.. ఎనిమిది మందికి గాయాలు