శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై మండల తెదేపా నాయకులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగులు ఉద్దేశపూర్వకంగానే విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారని నాయకులు ఆరోపించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు... విగ్రహాలను పరిశీలించారు.
ఈ ఘటనను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. దేవుళ్లు, రాజకీయ నాయకుల విగ్రహాల జోలికి వెళ్లవద్దని అచ్చెన్నాయుడు కోరారు.