రాష్ట్రస్థాయి నాలగవ సైకిల్ పోలో పోటీలను ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. శ్రీకాకుళం కేంద్రంగా ఈ పోటీలు జరగడం చాలా ఆనందంగా ఉందని ఉపముఖ్యమంత్రి అన్నారు. వైష్ణవి కళాశాల ఆవరణలో రెండు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి.
శ్రీకాకుళంలో రాష్ట్రస్థాయి సైకిల్ పోలో పోటీలు - deputy chief minister dharmana krishnadas news
శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్రస్థాయి సైకిల్ పోలో పోటీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు.
రాష్ట్రస్థాయి సైకిల్ పోలో పోటీలు
సైకిల్ పోలో క్రీడను అభివృద్ధి చేస్తూ ప్రోత్సహిస్తున్న నిర్వాహకులకు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్న కృష్ణదాస్.. సైకిల్ పోలో క్రీడలకు కూడా సహకారం అందిస్తామన్నారు. పోటీల్లో గెలుపోటములను పట్టించుకోకుండా.. క్రీడా స్ఫూర్తితో ఆడాలని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:నష్టాల్లో ఉన్న కంపెనీకి ఇసుక టెండర్లను ఎలా అప్పగిస్తారు: గోరంట్లు బుచ్చయ్య