Speaker: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం ఓ వాలంటీరులా పని చేస్తున్నారని,.. తమది వాలంటీరు ప్రభుత్వమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న తామంతా వాలంటీర్లమేనని పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని కింతలిలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో స్పీకర్ పాల్గొని మాట్లాడారు. కరోనా విపత్తు సమయంలో ఎనలేని సేవలందించిన ఘనత వాలంటీర్లదేనన్నారు. తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారిని గుర్తించి, అవార్డులు అందించడమంటే వారిని గౌరవించడమేనని పేర్కొన్నారు.
Speaker Tammineni: 'మాది వాలంటీరు ప్రభుత్వం': స్పీకర్ తమ్మినేని - వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
Speaker: కరోనా విపత్తు సమయంలో ఎనలేని సేవలందించిన ఘనత వాలంటీర్లదేనని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని కింతలిలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
TAGGED:
srikakulam latest news