ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాం' - srikakulam latest news

కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆయన అన్నారు. వైరస్ సోకకుండా ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

minister dharmana
minister dharmana

By

Published : Mar 24, 2020, 5:18 AM IST

మీడియాతో మంత్రి ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కరోనా ప్రత్యేక వార్డును కలెక్టర్ నివాస్​తో కలిసి మంత్రి పరిశీలించారు. కరోనా వ్యాప్తి చెందకుండా... కలెక్టర్​తో పాటు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలను తీసుకుంటోందని ఆయన అన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా తీసుకుంటున్న చర్యలకు ప్రజలు స్వచ్ఛందంగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. అలాగే కంట్రోల్ రూమ్​ని ఏర్పాటు చేశామని చెప్పారు. అంతకు ముందు కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details