మొబైల్ వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ అధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘంలోని వెంగళరావు కాలనీ, కొర్లకొటలో పర్యటించిన ఆయన.. రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. పంపిణీ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
'మొబైల్ వాహనం ద్వారా రేషన్ పంపిణీని వేగవంతం చేయాలి' - Civil Supplies Commissioner Kona Shashidhar visita at srikakulam district
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ పర్యటించారు. మొబైల్ వాహనం ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు.
మొబైల్ వాహనం ద్వారా రేషన్ పంపిణీ