శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డీ.గోవిందరావు వినతి పత్రం అందించారు. భవన కార్మికులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు రూ.10వేలు భృతి చెల్లించాలని... వెల్ఫేర్ బోర్డ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు తీసుకోవడం ఆపాలని కోరారు.
'భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయండి' - amudalavalasa construction workers news
భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని స్పీకర్‌ను సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోరారు. వారికి భృతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

స్పీకర్‌కు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వినతిపత్రం