నాలుగో దశ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో పోలింగ్ సిబ్బంది కొరత వేధిస్తోంది. పలువురు పోలింగ్ సిబ్బంది విధులకు డుమ్మా కొట్టగా... రిజర్వ్ సిబ్బందీ హాజరుకాకపోవడం సమస్యకు కారణమైంది. రిజర్వులో 129 మంది పీవోలు, 116 మంది ఏపీవోలు, ఏడుగురు ఆర్ఓలుగా నియమితులయ్యారు. వీరిలో చాలామంది విధులకు హాజరుకాలేదు. సమస్య జిల్లా కలెక్టర్ దృష్టికి రావడంతో ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను నియమించారు.
పంచాయతీ ఎన్నికల విధులకు సిబ్బంది డుమ్మా..! - శ్రీకాకుళం పంచాయతీ ఎన్నికల వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికలను సిబ్బంది కొరత వెంటాడింది. దీనికితోడు నియమించిన సిబ్బంది కూడా విధులకు గైర్హాజరవడంతో... కలెక్టర్ ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారు.
ఎన్నికల విధులకు సిబ్బంది డుమ్మా.. ఉపాధ్యాయులను నియమించిన కలెక్టర్