నిలకడగా వంశధార నది ప్రవాహం
07:47 September 14
వంశధార నదిని దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరికలు
శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదీ ప్రవాహం నిలకడగానే ఉంది. హిరమండలం గొట్టా బ్యారేజ్ వద్ద 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒడిశాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వంశధారకు వరద పెరుగుతోంది. వంశధార నది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా నదిని దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు.
ఇదీ చూడండి:Cm Jagan on Skill Development: ప్రతి నియోజకవర్గానికో ఐటీఐ: సీఎం జగన్