ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పార్టీ కోసం కష్టపడ్డ నన్ను విస్మరించారు' - పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం అధ్యక్ష పీఠం

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం అధ్యక్ష పీఠం ఆశించిన దువ్వాడ శ్రీకాంత్ నిరాశకు లోనయ్యారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ తనను ఇప్పుడు విస్మరించారని కన్నీటి పర్యంతమయ్యారు.

Srikanth is deeply disappointed with the non-arrival of the municipal presidency in palasa-kasibugga
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం అధ్యక్ష పీఠం ఆశించిన దువ్వాడ శ్రీకాంత్

By

Published : Mar 18, 2021, 10:19 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం అధ్యక్ష పీఠం ఆశించిన దువ్వాడ శ్రీకాంత్ నిరాశకు లోనయ్యారు. కొద్దిరోజులుగా అధ్యక్ష పీఠం రేసులో బళ్ల గిరిబాబు, దువ్వాడ శ్రీకాంత్​ల పేర్లు వినిపిస్తుండగా.. శ్రీకాంత్ పేరు ఖరారు కాలేదు. 17 వ వార్డు నుంచి వైకాపా తరఫున ఎన్నికైన దువ్వాడ శ్రీకాంత్​ను ఛైర్మన్‌ ఎంపికకాకపోవటంతో ఆవేదనకు గురయ్యారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని మంత్రి సీదిరి అప్పలరాజు సూచించినా... శ్రీకాంత్‌ వెళ్లలేదు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ తనను ఇప్పుడు విస్మరించారని కన్నీటి పర్యంతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details