శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్లో నిలిచిన రైళ్లు - undefined
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో ఆదివారం రెండు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫొని తుపాను కారణంగా భువనేశ్వర్ డివిజిన్లో రైల్ ట్రాకు విద్యుత్ మరమ్మతులకు గురికావడం వల్ల భువనేశ్వర్ వైపు వెళ్లే రైళ్లన్నీ గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి.
రైల్వే అధికారులు లైన్ క్లియర్ ఇవ్వకపోవడంతో పలు రైళ్లు వీధి స్టేషన్లో గంటల తరబడి వేచి ఉన్నారు. యశ్వంత్పూర్-భాగల్పూర్, విజయవాడ-హౌరా వెళ్తున్న రెండు రైళ్లను శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో సుమారు రెండు గంటలపాటు నిలుపుదల చేశారు. ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. భువనేశ్వర్ నుంచి శ్రీకాకుళం రోడ్డు మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లే పలు రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని రైల్వే స్టేషన్ మేనేజర్ చంద్రశేఖర్ రాజు తెలిపారు.