శ్రీకాకుళం జిల్లాలో 13 మందికి తెదేపా రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా నాయకులకు మరోసారి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు.. సిక్కోలుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని నేతలు తెలిపారు. పార్టీ పరమైన పదవుల్లో బీసీలకు పెద్దపీట వేస్తూ.. అవకాశం కల్పించారన్నారు. తెదేపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో కలిసి కట్టుగా శ్రమిస్తామన్నారు
చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీకాకుళం తెదేపా నేతలు - శ్రీకాకుళం తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో 13 మందికి తెదేపా రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీకాకుళం తెదేపా నేతలు