మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర శివాజీ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కాశిబుగ్గ మూడు రోడ్ల కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌కి అంతరాయం కలగటంతో.. మాజీ ఎమ్మెల్యే శివాజీతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.