శ్రీకాకుళం జిల్లాలో దేవాలయాలు, చర్చిలు, మసీదుల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ అమిత్‌బర్దార్ ప్రకటించారు. ఇప్పటికే డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో మతపెద్దలు, శాంతి కమిటీలను ఏర్పాటు చేసి భద్రతా పరమైన విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మత సామరస్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మత సామరస్యానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ - శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్
దేవాలయాలు, చర్చిలు, మసీదుల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్ ప్రకటించారు. మత సామరస్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సామాజిక మాధ్యమాల్లో విగ్రహాల ధ్వంసం వంటి అసత్య ప్రచారాలకు పాల్పడితే బైండోవర్ కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో గ్రామ, మండల స్థాయిలో కానిస్టేబుల్, గ్రామ వాలంటీరు, మహిళా సంరక్షణ కార్యదర్శి, స్థానిక యువతతో కలిసి గ్రామరక్షణ దళాలను ఏర్పాటు చేస్తామన్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. డీఎస్పీ మహేంద్ర, సీఐ అంబేద్కర్ ఉన్నారు.
ఇదీ చదవండి:రామతీర్థం ఘటన నిందితులను మూడురోజుల్లో పట్టుకుంటాం: వెల్లంపల్లి
TAGGED:
srikakulam sp press meet