శ్రీకాకుళం జిల్లాలోని వివిధ దేవాలయాలు, మసీదులు, చర్చిల మత పెద్దలతో జిల్లా ఎస్పీ అమిత్బర్దార్ మత సామరస్య సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాలు ఎక్కువగా వస్తున్నాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో జరగుతున్న దురదృష్టకరమైన ఘనటల నేపథ్యంలో ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మత పెద్దలకు సూచించారు.