సైబర్ మోసాలపై, ఆన్లైన్ లావాదేవీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అమిత్ బార్దార్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అవేర్‌నెస్ వీక్-2020ని పురస్కరించుకొని ' మూహ్ బంద్ రఖో ' పేరిట నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ ప్రతి వ్యక్తికి నిత్యావసర వస్తువుగా మారిందని.. ఉపయోగం ఎంత ఉందో, హాని కూడా అంతే ఉందన్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా బ్యాంకు, వ్యాపార ఆన్లైన్ షాపింగులు సులభంగా అవుతున్నాయన్నారు. ఈ విధమైన లావాదేవీలు జరిపేటప్పుడు ప్రజలు చాలా అప్రమమత్తంగా ఉండాలన్నారు.