శ్రీకాకుళం జిల్లాలో ఈనెలలో కరోనా తీవ్రత తగ్గిందని ఎస్పీ అమిత్ బర్దార్ పేర్కొన్నారు. కొవిడ్ తీవ్రత తగ్గిందే తప్ప.. కరోనా వైరస్ లేదని ప్రజలు అనుకోవద్దని అన్నారు. జిల్లా పోలీస్‌శాఖ లాక్‌డౌన్ సమయం నుంచి మంచి విధులు నిర్వహించారని కొనియాడారు. అయితే ఇప్పటివరకు 5 వందల 25 మంది పోలీస్ సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారన్న ఎస్పీ.. సిబ్బందిలో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. ప్రజలు రానున్న కాలంలో బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ అమిత్ బర్దార్ కోరారు.
జిల్లాలో కరోనా తీవ్రత తగ్గింది: ఎస్పీ - updates on corona cases in srikakulam
శ్రీకాకుళం జిల్లాలో కరోనా తీవ్రత తగ్గిందని ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. ప్రజలు కరోనా నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించారు.

ఎస్పీ అమిత్ బర్దార్