ఫొని ధాటికి ఇంకెంత నష్టపోవాల్సి ఉంటుందోనని రాత్రంతా ప్రజలు జాగారం చేశారు. కొన్ని పంటలు పొలాల్లోనే ఉన్నాయి. జీడిమామిడి, పనస పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. ఈ సమయంలో పెనుగాలులు వీస్తే బతుకు ఏమైపోతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. నిన్న చిన్న చిన్న జల్లులతో మొదలైన వర్షం... గంటలు గడిచే కొద్ది పెరిగింది. ఇది ప్రజల్లో కాస్త భయాందోళనలు కలిగించింది. రాత్రి 9 గంటల తర్వాత గాలల తీవ్ర కూడా పెరిగింది. మరో ఉపద్రవం తప్పదేమోనన్న బెంగ.. ఉద్దానం ప్రాంత ప్రజల్లో మొదలైంది. వేకువ జామున వాతావరణం శాంతించింది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గాలుల ఉద్ధృతి క్రమంగా బలహీన పడింది.
ముప్పు తప్పింది... సిక్కోలు ఊపిరి పీల్చుకుంది...
ఫొని తుపాను ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోని ఆందోళనలో ఉన్న శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే ఇటీవలే తిత్లి ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఈ ఉద్యానవనం... ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇంకా ఆ చేదు జ్ఞాపకాలు మరువక ముందే మరో తుపాను వారి కంటిమీద కునుకు లేకుండా చేసింది.
సిక్కోలు ఊపిరి పీల్చుకుంది
వాతావరణ మార్పులతో కాస్త ఉపశమనం పొందిన రైతులు... ఎక్కడో అనుమానం ఉండనే ఉంది. ముప్పుతప్పిందన్న అధికారుల ప్రకటనతో దీర్ఘశ్వాస తీసుకున్నాడు సిక్కోలు రైతు. వరద ప్రభావం ఉన్నందున పొలాల్లో తడిచి ఉన్న పంటను రక్షించే పనిలో నిమగ్నమయ్యాడు. గాలుల ధాటికి నేలరాలిన పనస, జీడిమామిడి, కొబ్బరిని ఓ చోట చేరవేసుకుంటున్నాడు.