శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు లాక్డౌన్ను పక్కాగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నా.. కొందరి తీరు మారకపోవడం వల్ల పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. పదే పదే బయటకు వస్తున్న వారి వాహనాలకు ఎరుపు రంగుతో మార్క్ వేస్తున్నారు. ఇలాంటి వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదని పెట్రోల్ బంకుల యాజమాన్యానికి ఆదేశాలిచ్చారు. ఇలాగైనా అనవసరంగా బయటకు వచ్చే వారిని నియంత్రించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అనవసరంగా బయటకు వస్తే రంగు పడుద్ది.. ఆ తర్వాత..! - srikakulam police take strict action on lockdown negligence people
లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని పదే పదే చెబుతున్నా కొంతమంది వినడం లేదు. ఇలాంటి వారిపై సిక్కోలు పోలీసులు వినూత్న రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. వాహనచోదకుల నిర్లక్ష్యానికి.. పోలీసులు రంగుతో సమాధానం చెబుతున్నారు.

అనవసరంగా బయటకు వస్తే రంగు పడుద్ది.. ఆ తర్వాత..!
Last Updated : Apr 18, 2020, 7:53 PM IST
TAGGED:
lock down news in srikakulam