ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

18 నెలల పాలనలో ఒక్క మంచి పనైనా చేశారా: రామ్మోహన్ నాయుడు - శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వార్తలు

18 నెలల పాలనలో ప్రజలకోసం ఒక్క మంచి పనైనా చేశారా అని వైకాపా ప్రభుత్వాన్ని ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ఒకమాట, గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.

rammohan naidu
రామ్మోహన్ నాయుడు, ఎంపీ

By

Published : Nov 20, 2020, 6:03 PM IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూర్తిగా విఫలం అయిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. పలాసలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

రాజధాని అమరావతి, పోలవరం విషయంలో ఎన్నికల ముందు ఒక మాట.. తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారన్నారు. మాయమాటలతో 18 నెలల నుంచి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇసుక, మద్యం పాలసీలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. వైకాపా నాయకులు ఇసుక విధానాన్ని వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. మద్య నిషేధం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని.. 18 నెలలు కాలంలో ఒక్క మంచి పనైనా చేశారా అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details