దేశంలోని పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చే చర్యలు వేగవంతం చేయాలని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి ఏటా వేల మంది ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారు. లాక్ డౌన్ కారణంగా వారంతా అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. చెన్నై, హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌లో వీరంతా కూలీలుగా పని చేస్తున్నట్లు లేఖలో వెల్లడించారు. అక్కడి నుంచి ప్రత్యేక శ్రామిక రైళ్లు వేసి వారిని స్వస్థలాలకు చేర్చాలని రామ్మోహన్‌నాయుడు కోరారు.
త్వరగా ఇంటికి చేర్చండి... కేంద్రమంత్రికి ఎంపీ రామ్మోహన్ లేఖ - mp rammohan naidu latest news
శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చే చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
కేంద్రమంత్రి ఎంపీ రామ్మోహన్నాయుడు లేఖ