ఉప్పు, పప్పు, చెత్తతో సహా ప్రతి దానిపై వైకాపా ప్రభుత్వం పన్ను వేసి... మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. నవరత్నాల పేరుతో సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాలు.. వాస్తవానికి బూడిద రత్నాలని ఎద్దేవా చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచిన మంత్రి కొడాలి నానికి.. రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజల్లో ఇప్పటికే మార్పు మొదలైందని... 2024 ఎన్నికల్లో వైకాపాకు పరాభవం తప్పదన్నారు.
MP RAMMOHAN: 'నవరత్నాలు కావవి.. బూడిద రత్నాలు..' - ap latest news
నవరత్నాల పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నవరత్నాలు కావవి.. బూడిద రత్నాలని ఎద్దేవా చేశారు.
'నవరత్నాలు కావవి.. బూడిద రత్నాలు..'