ఉపాధి కోసం ఉన్న ఊరు వదిలి దేశం కాని దేశానికి వెళ్లి తనువు చాలించాడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని లొదపుట్టి గ్రామానికి చెందిన పరశురాం. గత 20ఏళ్లుగా పెట్రోలియం కంపెనీలో పని చేస్తున్న పైలా పరశురాం (51) సోమవారం మృతి చెందగా.. ఆయన మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దుబాయ్లో సిక్కోలువాసి అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని లొదపుట్టి గ్రామానికి చెందిన పరశురాం దుబాయ్లో మృతి చెందాడు. పెట్రోలియం కంపెనీలో పనిచేస్తున్న ఆయనకు కరోనా పరీక్షలు చేసేందుకు తీసుకొని వెళ్లడం, ఆనంతరం పరశురాం విగత జీవిగా మారడం అనుమానాలకు తావిస్తుంది.
దుబాయ్లో శిక్కోలు వాసి అనుమానస్పద మృతి
ఆయనతోపాటు పనిచేస్తున్న తోటి వలస కూలీలు కుటుంబ సభ్యులకు సమాచారం అందిచారు. ఈ మేరకు కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఆయనతో ఉన్న ముగ్గురిని అక్కడ వైద్య అధికారులు పరీక్షించేందుకు తీసుకెళ్లారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైయ్యాడు. ఇది జరుగుతుండగానే పరశురాం విగత జీవిగా మారాడంపై ఆయన స్వగ్రామంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరశురాం దుర్మరణం ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది.
ఇవీ చూడండి...
వ్యక్తి ఆత్మహత్య... ఇంటి బాధ్యతే కారణమా?
TAGGED:
దుబాయ్ లో అనుమానాస్పద మృతి