బాహుదా నదిలో పడి.. నలుగురు మృతి - srikakulam mahilalu
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగిలో విషాదం చోటు చేసుకుంది. బాహుదా నదిలో ప్రమాదవశాత్తూ మునగటంతో నలుగురు మృతి చెందారు.
![బాహుదా నదిలో పడి.. నలుగురు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3270938-thumbnail-3x2-vishadam.jpg)
vishadam
బాహుదా నదిలో పడి నలుగురు మృతి
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగిలో విషాదం నెలకొంది. బాహుదా నదిలో ప్రమాదవశాత్తు నీట మునిగి నలుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు తోటికోడళ్లు కాగా... మరో ఇద్దరు 12 ఏళ్ల బాలికలుగా గుర్తించారు. దుస్తులు ఉతికేందుకు వెళ్లి మునిగిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం ఆసుపత్రికి తరలించారు.