ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమర వీరుడుకి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి - శ్రీకాకుళం జవాన్ వీర మరణం

దాయాది దేశమైన పాకిస్థాన్ కుయుక్తులకు మరో జవాన్ అమరుడయ్యారు. భారతభూభాగంలో పాకిస్థాన్ ఏర్పాటు చేసిన బాంబులను నిర్విర్వం చేస్తున్న క్రమంలో శ్రీకాకుళంకు చెందిన లావేటి ఉమామహేశ్వరరావు వీరమరణం పొందారు.

javan died
శ్రీకాకుళం జవాన్ వీర మరణం

By

Published : Jul 22, 2020, 5:59 PM IST

పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని కార్గిల్ ప్రాంతం వద్ద... పాకిస్థాన్​కు చెందిన బాంబులు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో శ్రీకాకుళానికి చెందిన జవాను వీరమరణం పొందారు. హడ్కో కాలనీకి చెందిన లావేటి ఉమామహేశ్వరరావు.. బాంబ్ స్క్వాడ్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా భారత భూభాగంలో ఉన్న.. పాకిస్థాన్​కు చెందిన బాంబులను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తూ బాంబ్ పేలటంతో ఉమామహేశ్వరరావు అక్కడికక్కడే మరణించారు. ఉమామహేశ్వరరావు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా... ఆయన పార్థీవ దేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సైనిక లాంఛనాలతో అమరవీరుడి అంత్యక్రియలు నిర్వహించారు. ఉమామహేశ్వరరావు అంత్యక్రియల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశ రక్షణకై విధులు నిర్వర్తిస్తూ అమరుడైన వీర జవాన్​కు నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరూ రాలేదనీ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

అమర వీరుడుకి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి

ABOUT THE AUTHOR

...view details