కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వీటిని పలువురు రైతులు కళ్లాలుగా ఉపయోగించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి జి.సిగడాం వెళ్లే రహదారి పొడవునా మొక్కజొన్న పంటలను రైతులు రహదారులపై ఆరబెడుతున్నారు. రహదారి పొడవునా మొక్కజొన్న పిక్కలను వేసి ఎండ పెడుతున్నారు.
లాక్డౌన్ వేళ.. రహదారులే రైతులకు కళ్లాలుగా! - srikakulam district latest news
రాజాం నుంచి జి.సిగడాం వెళ్లే దారిలో మొక్కజొన్న పంటలను రైతులు రహదారులపై ఆరబెట్టుకుంటున్నారు.
రోడ్లపై ఆరబెడుతున్న మొక్కజొన్న పిక్కలు