గ్రామాల్లో పునరావాస కేంద్రాలు సత్వరం సిద్ధం చేయాలని... గ్రామ సచివాలయ సిబ్బందికి అధికారులు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో 26 పునరావాస కేంద్రాలు తెరిచి అందులో వెయ్యిమందికి పునరావాసం కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు పునరావాస కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు.
జిల్లాలో పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు - corona news in srikakaulam dst
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో పునరావాస కేంద్రాలు తెరిచి... వెయ్యిమందికి పునరావాసం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరితగతిన వీటిని సిద్ధం చేయాలని సచివాలయ సిబ్బందికి అధికారులు దిశానిర్ధేశం చేశారు.
![జిల్లాలో పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు srikakulam dst officers take steps to arrange centers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7186644-655-7186644-1589383980616.jpg)
srikakulam dst officers take steps to arrange centers
నరసన్నపేట మండలం కంబకాయ, సుందరపురం తదితర గ్రామాల్లోని పునరావాస కేంద్రాల ఏర్పాటుపై ఎంపీడీవో ఆర్ వెంకట్రావు గ్రామ సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. ప్రతి పదిమందికి ఒక మరుగుదొడ్డి సిద్ధం చేయాలన్నారు. అలాగే తరచూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.