ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆందోళన వద్దు.. ఆదుకుంటాం'

గుజరాత్ నుంచి వచ్చిన శ్రీకాకుళం జిల్లా మత్సకారులను ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పరామర్శించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

srikakulam dst mla vistis fishermens who came from gujarath
srikakulam dst mla vistis fishermens who came from gujarath

By

Published : May 5, 2020, 5:41 PM IST

కరోనా మహమ్మరి దేశంలో వ్యాప్తి చెందడంతో కేంద్రం లాక్ డౌన్ విధించిన కారణంగా.. గుజరాత్ రాష్ట్రంలోని వేరావలిలో చిక్కుకున్న మత్స్యకారులను ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం తామాడ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 222 మంది మత్స్యకారులను క్వారంటైన్ చేసింది.

ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్.. వారిని పరామర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు, రైతులకు, యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థిక సహాయం కింద ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున అందిస్తున్నామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details