శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామంలో లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలు గుంపులుగా చేరారు.గ్రామదేవత శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో ప్రజలు పాల్గొని గ్రామ వీధుల్లో సందడి చేస్తూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
ఇప్పటికే గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న పాతకుంకాల గ్రామంలో కరోనా పరీక్షలు నిమిత్తం పలువురు అనుమానితులను ఆసుపత్రికి తరలించారు. ఇటువంటి సమయంలో ఈ కార్యక్రమాన్నినిర్వహించటం మిగిలిన ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది.