శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పోలీసుల పహారాలో లాక్‌డౌన్ నిబంధన పకడ్బందీగా కొనసాగుతోంది. కరోనా కట్టడికి కట్టుదిట్ట చర్యల్లో భాగంగా రోడ్లపైకి వచ్చివారిని పోలీసులు నియంత్రిస్తున్నారు. అత్యవసరం మినహా రోడ్లపైకి వచ్చివారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్న వారిని గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా లాక్‌డౌన్ - lockdown updates in srikakulam
శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి విధించిన లాక్‌డౌన్ ప్రక్రియ శ్రీకాకుళం జిల్లాలో కట్టుదిట్టంగా అమలవుతోంది. అనుక్షణం పోలీసులు పహారా కాస్తూ ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా విధులు నిర్వర్తిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా లాక్‌డౌన్