ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Srikakulam: 'రాళ్లు కొట్టిన చెయ్యి'.. పిడికిలెత్తింది..! - శ్రీకాకుళం జిల్లా వార్తలు

భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయొద్దంటూ.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస రాళ్లు కొట్టే కార్మికలు నిరసన తెలిపారు. 70 ఏళ్లుగా తమ పూర్వీకుల నుంచి ఆధారపడి బతుకుతున్న భూమిని కాలనీ పేరుతో తీసుకొని పంచిపెడుతూ తమకు మాత్రం అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

srikakulam
భూమి పూజ

By

Published : Jul 3, 2021, 5:19 PM IST

బండరాళ్లను కొట్టి వ్యవసాయ భూమిగా మార్చుకున్న తరువాత ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోవడం అన్యాయమంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. 70 ఏళ్లుగా తమ పూర్వీకుల నుంచి ఆధారపడి బతుకుతున్న భూమిని కాలనీ పేరుతో తీసుకొని పంచిపెడుతూ తమకు మాత్రం అన్యాయం చేస్తున్నారని రాళ్లు కొట్టే కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయొద్దని బైఠాయించారు.

ఎస్సీ, బీసీ సామాజిక వర్గానికి 45 కుటుంబాల ఆధీనంలో 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేదని, ప్రభుత్వం వివిధ అవసరాలకు కేటాయింపు చేయడంతో ప్రస్తుతం 6.50 ఎకరాలు మాత్రమే మిగిలిందని బాధితులు తెలిపారు. సంఘటన స్థలానికి తహసీల్దార్ గణపతి, సీఐ నీలయ్య, ఇద్దరు ఎస్సైలు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమానికి అడ్డుపడటం తగదని, ఏదైనా సమస్య ఉంటే ప్రజాప్రతినిధులు, అధికారులను కలవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details