శ్రీకాకుళం జిల్లా రాజాం సామాజిక ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం రోగుల పాలిట శాపమవుతోంది. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక రోగులు నానా అవస్థలు పడాల్సివస్తోంది. మరుగుదొడ్లు శుభ్రంగా లేని కారణంగా... బహిర్భూమికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు. దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన చెందారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజాం ఆసుపత్రిలో అధ్వాన్నంగా మరుగుదొడ్ల నిర్వహణ - రాజాం
రాజాం ప్రభుత్వాసుపత్రిలో మరుగుదొడ్ల నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది. పగిలిపోయిన శౌచాలయం, టాయిలెట్ బేసిన్లు, నాచు పట్టిన మరుగుదొడ్లు... వీటికి తోడు భయంకరమైన దుర్వాసన. ఈ కారణంగా.. రోగులు, వారి సహాయకులు బహిర్భూమికి బయటకే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
రాజాం ఆసుపత్రిలో మరుగుదొడ్ల నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది.