ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోరిక తీర్చలేదని ముగ్గురు మహిళలను చంపేశాడు! - శ్రీకాకుళంలో మహిళల హత్యలపై ఎస్పీ వార్తలు

ముగ్గురు మహిళలను మూడు రాష్ట్రాల్లో చంపిన ప్రబుద్ధుడు.. చివరకు సిక్కోలులో చిక్కాడు. ఆ మానవ మృగాడు.. ఏపీతోపాటు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ముగ్గురు వివాహితులను గొంతు నులిమి చంపేశాడు.

srikakulam-district-police-arrested-odisha-state-man-in-women-death-case
srikakulam-district-police-arrested-odisha-state-man-in-women-death-case

By

Published : Jun 7, 2020, 3:49 AM IST

అతడి పేరు సవర రమేష్.. ఒడిశాకు చెందిన వ్యక్తి. తేలిగ్గా మహిళలను చంపేస్తాడు. ముందుగా మహిళలతో పరిచయాలు పెంచుకుంటాడు... ఆ తర్వాత కోరిక తీర్చమంటాడు. తీరిస్తే...సరేసరి... లేదంటే అతడి చేతిలో బలికావాల్సిందే!. అలా... 2016 నుంచి ఇప్పటివరకు ముగ్గురు మహిళలను హతమార్చాడు. చివరకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీసుల చేతికి చిక్కాడు. ఈ కేసును ఛేదించిన పాతపట్నం పోలీసులకు ఎస్పీ అమ్మిరెడ్డి నగదు బహుమతిని అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details