ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింధు పుష్కరాల్లో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో బయటపడ్డ యాత్రికులు - ఏపీ లేటెస్ట్ న్యూస్

srikakulam-district-people-facing-problems-in-sindhu-pushakr-yatra
సింధు పుష్కరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఇబ్బందులు

By

Published : Nov 24, 2021, 10:25 AM IST

Updated : Nov 24, 2021, 10:18 PM IST

10:22 November 24

డబ్బులు కట్టాలని 240 మందిని నిర్బంధించిన హోటల్ సిబ్బంది

సింధు పుష్కరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఇబ్బందులు

        సింధు పుష్కరాలకు వెళ్లి జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న రాష్ట్ర యాత్రికులు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి చొరవతో బయటపడ్డారు. హోటల్​ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. 

అసలేం జరిగింది.. 

రాష్ట్రం నుంచి సింధు పుష్కరాలకు వెళ్లిన యాత్రికులు కొందరు జమ్మూకశ్మీర్‌లో చిక్కుకుపోయారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట, అలాగే విజయనగరం జిల్లాకు చెందిన 12 మంది చీపురుపల్లి వాసులతో కలిపి మొత్తం 240 మంది.. ఓ టూరిజం సంస్థకు డబ్బులు చెల్లించి యాత్రకు వెళ్లారు. మూడు రోజులు వైష్ణోదేవి ఆలయం సహా కొన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత కట్రాకు చేరుకున్నారు. 

అక్కడ ఓ హోటల్లో ఉండగా... టూరిజం సంస్థ వ్యక్తి కనిపించకుండా పోయాడు. బస చేసిందుకు డబ్బులు చెల్లించాలని హోటలు నిర్వాహకులు అడగడంతో.. అసలు విషయం వెలుగుచూసింది. డబ్బులు కట్టేవరకూ విడిచిపెట్టేది లేదంటూ... హోటల్ నిర్వాహకులు వీరిని నిర్భందించారు.  ఈ క్రమంలో అక్కడి సెక్యూరిటీ గార్డుతో గొడవ పడి బలవంతంగా బయటకు వచ్చి... ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఈ వ్యవహారంపై పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి వెళ్లగా.. సంబంధిత అధికారులతో మాట్లాడారు. వెంటనే స్థానిక  డీఎస్పీ అక్కడకు చేరుకుని యాత్రికులతో మాట్లాడటంతో.. యాత్రికులు హోటల్ నుంచి బయటకు వచ్చారు.

ఇదీ చూడండి

Kondapalli Municipal Chairman Election: కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రారంభం

Last Updated : Nov 24, 2021, 10:18 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details