దాదాపు రూ.12 కోట్లతో ఓ చిట్టి వ్యాపారి పరారైన ఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కోరాడ గణేష్ అనే వ్యాపారి గత కొన్ని ఏళ్లుగా నరసన్నపేటలో వడ్డీ వ్యాపారం, చిట్ ఫండ్ నిర్వహిస్తున్నాడు. 300 మంది 12 కోట్ల రూపాయల్ని అతని వద్ద దాచుకున్నారు.
కన్నతల్లిని వదిలేసి.. రూ.12కోట్లతో పరారైన చిట్టీల వ్యాపారి - శ్రీకాకుళం జిల్లా వార్తలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చిట్టీల వ్యాపారి 300మందిని మోసం చేసి రూ.12 కోట్లతో ఉడాయించాడు. దీంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు.
చిట్టి వ్యాపారి
విద్యాశాఖ అధికారిగా పనిచేసి.. ఉద్యోగ విరమణ చేసిన వి. వి. రత్నాల రాజు కూడా వారిలో ఉన్నారు. 90ఏళ్ల వయసున్న తన తల్లి కాంతమ్మను బయట ఉంచి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా రూ.12 కోట్లతో ఉడాయించాడు. కాగా కాంతమ్మను చుట్టుపక్కల వారు చేరదీశారు.
ఇదీ చదవండి:అప్పుల బాధలు తాళలేక వ్యక్తి ఆత్మహత్య