కరోనా వైరస్‌పై ప్రజలకు ధైర్యం చెప్పాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే. నివాస్ అధికారులకు సూచించారు. నరసన్నపేటలో భవానిపురం, ఇందిరానగర్ తదితర కంటైన్మెంట్ జోన్లను కలెక్టర్ పరిశీలించారు. కరోనా అనుమానితులు గుర్తించి బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
కరోనా వైరస్‌పై ప్రజలకు ధైర్యం చెప్పాలి: కలెక్టర్ నివాస్ - శ్రీకాకుళంలో కరోనా కేసులు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని కంటైన్మెంట్ జోన్లలో కలెక్టర్ నివాస్ పర్యటించారు. కరోనా నిర్ధరణ అయిన వారు హోమ్ ఐసోలేషన్ పొందవచ్చని కలెక్టర్ అన్నారు.
కరోనాపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్
కరోనా పరీక్షల్లో నిర్ధరణ అయితే వారు హోమ్ ఐసోలేషన్ పొందవచ్చని జే. నివాస్ అన్నారు. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో తాగునీరు తదితర అత్యవసర వస్తువుల సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదు