శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ను నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసిన గదిని కలెక్టర్ నివాస్ పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో టీకాను నిల్వ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వాక్సిన్ నిల్వ విధానం, అందుకు అవసరమైన సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వెబ్ తో అనుసంధానం చేయాలని సూచించారు. వ్యాక్సిన్ నిలువ చేసే రిఫ్రిజిరేటర్ల కూలింగ్ స్ధాయిని ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. నిల్వ చేసే గదికి పూర్తి భద్రత చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
కొవిడ్ టీకా నిల్వ చేసే గదిని పరిశీలించిన కలెక్టర్ - news updates in srikakulam-district
శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ టీకా నిల్వ చేసే గదిని కలెక్టర్ నివాస్ పరిశీలించారు. వ్యాక్సిన్ నిల్వ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
కొవిడ్ టీకా నిల్వ చేసే గదిని పరిశీలించిన కలెక్టర్ నివాస్