శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట క్రికెట్ ఉపకేంద్రంలో జరిగిన వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జె. భాస్కర్ రావు హాజరయ్యారు. బాలికలను క్రికెట్ క్రీడలో రాణించే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. జిల్లాలో నాలుగు చోట్ల క్రికెట్ శిక్షణా శిబిరాలు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తోన్న వ్యాయామ ఉపాధ్యాయులు బాలికలను క్రికెట్లో రాణించే విధంగా శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు. క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
'క్రికెట్లో బాలికలను ప్రోత్సహించాలి' - summer camp
బాలికలలో క్రికెట్ క్రీడ పట్ల ఆసక్తిని పోత్సహించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చెప్పారు. ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా నాలుగు చోట్ల క్రికెట్ శిక్షణా శిబిరాలు నిర్వహించామన్నారు.

వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం