ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విధి నిర్వహణలో అలసత్వం.. ఇద్దరు అధికారులపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు - శ్రీకాకుళంలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్

విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు శానిటరీ కార్యదర్శులపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ సస్పెన్షన్ వేటు వేశారు. మోనింగివారి వీధి 1, 2వ వార్డు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆమదాలవలస జగనన్న కాలనీ లే అవుట్లలో ఇళ్ల నిర్మాణ ప్రగతిపై ఉదాసీనత వీడాలని సంబంధిత అధికారులను హెచ్చరించారు.

ఇద్దరు అధికారులపై కలెక్టర్ సస్పెష్షన్ వేటు
ఇద్దరు అధికారులపై కలెక్టర్ సస్పెష్షన్ వేటు

By

Published : Apr 14, 2022, 8:57 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జగనన్న కాలనీ లే అవుట్లలో ఇళ్ల నిర్మాణ ప్రగతిపై ఉదాసీనత వీడాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించారు. స్థానిక కృష్ణాపురం, మోనింగివారి వీధి 1, 2వ వార్డు సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయాలకు ప్రజల నుంచి అందే వినతులు నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలని సబంధింత అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి కార్యదర్శి తన విధుల పట్ల పూర్తి అవగాహనతో, సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు.

మోనింగివారి వీధి ప్రాంతంలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్.. ఇద్దరు శానిటరీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నిర్మాణదశలో ఉన్న వైఎస్​ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్​ పనులను పరిశీలించి ప్రగతిని సమీక్షించారు. దాదాపు పనులు పూర్తి కావచ్చినందున జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభించేందుకు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కలెక్టర్ వెంట కమిషనర్ ఎం. రవి సుధాకర్, తహశీల్దార్ వై.వి.పద్మావతి, ఏఈలు కె.అప్పలనాయుడు, బి.శృజన ఉన్నారు.

ఇదీ చదవండి: కోటంరెడ్డి, అనిల్ కుమార్ భేటీ.. నెల్లూరు రాజకీయాల్లో చర్చ!

ABOUT THE AUTHOR

...view details