శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ మృతదేహాన్ని తరలించడంలో నిబంధనలు పాటించని అధికారులపై జిల్లా పాలనాధికారి జె.నివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో నారాయణ మూర్తికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. టెక్కలి మేజర్ పంచాయతీ ఈవో శాంతిస్వరూప్, పారిశుద్ధ్య కార్మికుడు రఘును సస్పెండ్ చేశారు. నాలుగు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించిన వృద్ధురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి జిల్లా ఆసుపత్రిలో భద్రపరిచారు.
చెత్త సేకరణ బండిపై మృతదేహం తరలింపు.. అధికారులపై వేటు - శ్రీకాకులం జిల్లా పాలనాధికారి చర్యలు
వృద్ధురాలి మృతదేహాన్ని చెత్త సేకరణ బండి మీద తరలించిన అధికారులపై వేటు పడింది. 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు శ్రీకాకుళం జిల్లా పాలనాధికారి స్పందించారు. మృతదేహాన్ని తరలించడంలో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలకు ఆదేశించారు.
అధికారులపై వేటు
మృతురాలి కుటుంబసభ్యుల ఆచూకీ తెలియకపోవడంతో.. అంత్యక్రియలు నిర్వహించేందుకు పంచాయతీ చెత్త సేకరణ బండిపై తీసుకెళ్లడం వివాదమైంది. మానవత్వాన్ని దిగజార్చేలా అధికారుల ప్రవర్తన ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనకు సంబంధించి 'ఈనాడు'లో ఆదివారం వార్త ప్రచురితమైంది. జిల్లా పాలనాధికారి స్పందించి అధికారులపై చర్యలకు ఆదేశించారు.
ఇదీ చదవండి: గొడవ ఆపేందుకు వెళ్లి వ్యక్తి మృతి... పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత