ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్‌ బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపండి...మౌలిక సదుపాయాలు కల్పిస్తాం' - srikakulam latest news

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని కొవిడ్‌ విభాగంలో చికిత్స పొందుతున్నవారికి మానసిక ధైర్యం కల్పించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం ద్వారా వారి ప్రాణాలు కాపాడవచ్చునని, వైద్యులంతా ఆ దిశగా వ్యవహరించాలని కలెక్టర్‌ జె.నివాస్‌ కోరారు. కొవిడ్‌ విభాగంలో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని వైద్యులు, పీజీ వైద్యులకు హామీ ఇచ్చారు.

srikakulam collector review metting in doctors
వైద్యులతో కలెక్టర్ సమీక్ష

By

Published : Aug 25, 2020, 8:33 AM IST

కొవిడ్‌ బాధితులకు వ్యాధిపై పూర్తి అవగాహన కల్పించి వారిలో మనోధైర్యం నింపాలని, అప్పుడే వారికి తమకు ఆరోగ్యభద్రత ఉందనే భావం కలుగుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. ఇందుకు శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కొవిడ్ విభాగంలో వైద్యం చేయడానికి అవసరమయ్యే మౌలిక వసతులు కల్పిస్తామని వైద్యులకు, పీజీ విద్యార్థులకు హామీ ఇచ్చారు.

ఆసుపత్రిలో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై కలెక్టర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని విభాగాల్లో అవసరమైన వైద్యపరికరాలు, సామగ్రి అవసరం ఉందని గుర్తించిన ఆయన వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి రోజు 20 నుంచి 30 కేసులు వస్తున్నాయని, వీరిలో అయిదుగురు చివరి దశలో వస్తున్నారని వైద్యులు వివరించారు.

ఇదీ చదవండి:కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్సులకు నిర్ణీత ఛార్జీలు

ABOUT THE AUTHOR

...view details