శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది మే నాటికి ప్రతి ఎకరాకు సాగునీరందించేలా పనులను పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో జలవనరులశాఖ, డ్వామా అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు పూర్తి చేసేందుకు నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. జిల్లాలో సరిపడా వనరులున్నా పూర్తి స్థాయిలో సాగునీటిని సరఫరా చేయకపోవడం భావ్యం కాదన్నారు. వంశధార కుడి, ఎడమ కాలువల పనులకు ఇప్పటి వరకు రూ.70 కోట్లు ఖర్చు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఉపాధి పథకం ద్వారా సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పలుచోట్ల చేపట్టిన చెరువు పనుల్లో నాణ్యత లోపించిందన్నారు.
అధికారులతో కలెక్టర్ నివాస్ సమీక్ష - srikakulam collector niwas review news
జలవనరుల శాఖ, డ్వామా అధికారులతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

అధికారులతో కలెక్టర్ నివాస్ సమీక్ష