ఉపాధి హామీలో మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.వెయ్యి కోట్లతో పనులు చేపట్టే అవకాశం ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. జిల్లాలో ఈ పనులను త్వరితగతిన చేపట్టి సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ మెటీరియల్ కంపోనెంట్ కింద అటవీశాఖ, గిరిజన సంక్షేమ శాఖలు తక్షణం పనులు ప్రారంభించాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయాలని... సంబంధిత శాఖల అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అంచనాలు తయారుచేసి దస్త్రాలు సమర్పించాలని స్పష్టం చేశారు.
రూ.వెయ్యి కోట్లతో మెటీరియల్ కాంపోనెంట్ పనులు - మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ సమీక్ష
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో... మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ సంచాలకులు చినతాతయ్యతో కలసి కలెక్టర్ నివాస్ సమీక్షించారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.వెయ్యి కోట్లతో పనులు ప్రారంభించనున్నారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై ఉపాధి హామీ సంచాలకులు చిన తాతయ్యలుతో కలసి కలెక్టర్ నివాస్ సమీక్ష