ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైరస్ సోకిన వారికి సరైన వైద్యం అందించాలి: కలెక్టర్ నివాస్ - వైద్యాధికారులతో సమావేశమైన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్

శ్రీకాకుళంలో కరోనా వైరస్​ వ్యాప్తిపై.. వైద్యాధికారులతో కలెక్టర్ నివాస్ సమీక్షించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని వెంటనే గుర్తించి అవసరమైన వైద్యం అందించాలని సూచించారు.

collector meeting with medical officers
collector meeting with medical officers

By

Published : Apr 24, 2021, 8:14 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతపై.. వైద్యాధికారులతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్ష నిర్వహించారు. వ్యాధి లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఏమాత్రం జాప్యం చేసినా ప్రాణాలకు ముప్పు తప్పదని అన్నారు. కోవిడ్-19 కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషిని కొనసాగించాలని సూచించారు.

వైద్యులు ధైర్యంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. నరసన్నపేటలో కరోనా వైరస్ ఎక్కువగా ఉందని గుర్తించామన్నారు. వీలైనంతవరకూ మరో 14 రోజుల పాటు జనసంచారం తగ్గించే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details