శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కలెక్టర్ నివాస్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వర్తక వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు విధిగా మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేశారు.
మాస్క్‌లు ధరించని వారికి సరుకుల ఇవ్వకూడదని వ్యాపారులను ఆదేశించారు. క్షౌరశాలలకు.. టీ దుకాణాలకు అనుమతివ్వలేదు. హోటల్స్‌లో ప్యాకెట్ల ద్వారా టీ విక్రయాలు చేయవచ్చన్నారు. వ్యాపార కార్యకలాపాలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతించారు. ఈ చర్యలకు అందరూ సహకరించాలని కలెక్టర్ నివాస్ కోరారు.