శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నాలుగు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు కలెక్టర్ నివాస్ తెలిపారు. మండలంలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఒక కంట్రోల్ రూమ్‌తో పాటు గ్రామస్థాయి కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇవాళ ఒక్కరోజే 8 టన్నుల కూరగాయలు సరఫరా చేశామన్నారు. తాగునీరు, నిత్యావసర సరుకులు, మొబైల్ ఏటీఎం ద్వారా నగదు.. పంపిణీ జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని.. అధికారులు, పోలీసులకు సహకరించాలని కోరారు.
'రెడ్‌జోన్ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపడుతున్నాం' - శ్రీకాకుళంలో కరోనా రెడ్‌జోన్ వార్తలు
కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నామని శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాల పంపిణీకి అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎవరూ ఆందోళనకు గురి కావద్దని సూచించారు.
srikakulam collector j. nivas Meeting with Mandala and village officials on corona red zone areas