కరోనా లక్షణాలు ఉన్నప్పటికి కరోనా ఉందా.. లేదా.. అనే ఆలోచన వద్దని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ ప్రజలను కోరారు. కరోనా లక్షణాలు కనిపించగానే చికిత్సకు రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించామని అన్నారు. రానున్న నెలన్నర రోజులలో అత్యంత కీలకమని..అందుకోసం కఠినంగా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. జిల్లాలో రోజుకు 800 నుంచి 1000కేసులు వరకు నమోదు అవుతున్నాయన్నారు. ప్రజలందరూ పూర్తిగా అప్రమత్తంగా ఉంటూ... వైరస్ నివారణకు సహకరించాలని కోరారు. శ్రీకాకుళం నగరంలో రోజుకు కనీసం 200 కేసులు నమోదు అవుతున్నాయన్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కూడా పరీక్షలు అధికంగా చేయుటకు నిర్ణయించామన్నారు.
'రానున్న నెలన్నర రోజులు అత్యంత కీలకమైనవి' - శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ కేసులు
కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ ప్రజలకు తెలిపారు. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్